మర్కుక్ మండల నూతన ఎస్ ఐ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ దామోదర్ ను గురువారం మర్కుక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కర్కపట్ల గ్రామ యువ నాయకులు రాళ్ల బండి బాలకృష్ణ, శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసుల పాత్ర మరువలేనిది అని, మర్కుక్ మండలంలో నేర నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.