హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు అందించడంతో పాటు రైతాంగం యొక్క చిరకాల వాంఛ అయిన గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ గురువారం రూ. 437 కోట్లు విడుదల చేయడంతో హర్షాతి రేఖలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా రైతాంగంతో పాటు కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.