క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరి మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి వెళుతుండగా ధర్మారం గ్రామ శివారులో శనివారం ట్రాలీ ఆటోను ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న మిరుదొడ్డి పోలీసులు గాయాలతో పడి ఉన్న ఎండి సోహెల్, ఖాదిర్లను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.