సిద్దిపేట జిల్లా దుద్దెడలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ఘటనపై ఫిజికల్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎఫ్ డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల ఫిజికల్ డైరెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.