కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో ఆగస్టు 1 గురువారం నుండి ప్రారంభం అయి 2వ తేది సాయంత్రం వరకు జరిగే ఉర్సు ఉత్సవాల ప్రదేశాన్ని అడిషనల్ డీఎస్పి మల్లరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అయన దర్గా చుట్టుపక్కల ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు. వాహనాలను రోడ్డుకు అడ్డదిడ్డంగా కాకుండా పార్కింగ్ ప్రదేశాలలోనే పార్కు చేయించాలని సూచించారు.