శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వరస్వామి దేవాలయంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలను అందజేశారు. సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రత తెలిపారు. భక్తులు మాట్లాడుతూ. రాముడి కళ్యాణ తళంబ్రాలు అందుకోవడం తమ అదృష్టం అన్నారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.