సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామం అంగన్వాడీ 2లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రూప, ఏంఎల్హెచ్పి స్నేహ, అంగన్వాడీ టీచర్ సునీత తల్లి పాల విశిష్టత గురించి విద్యార్థిని విద్యార్థులు తల్లులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆశా అరుంధతి, లావణ్య, అంగన్వాడి టీచర్ సునీత, అనితా, ఆయా ఐలవ్వ, తదితరులు పాల్గొన్నారు.