మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇది ఒక పనికిమాలిన చర్య అని ఎఫ్టీసీ మాజీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.