మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన దానమైన ముత్తమ్మ, కుమ్మరి బాలకృష్ణలు సీఎం సహాయనిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా, మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ తిరుమలరెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు క్రాంతి కుమార్, ఇతరులు పాల్గొన్నారు.