ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కోల్డ్ స్టోరేజ్ గోదాం దగ్ధం

67చూసినవారు
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగలో అరటిపండ్ల కోల్డ్ స్టోరేజ్ గోదాం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్దమైన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదాంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర వ్యవసాయ బావుల వద్ద ఉన్నవారు నీరు చల్లినప్పటికీ అదుపులోకి రాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ చేరుకొని రాత్రివరకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపూర్తిగా గోదాం కాలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్