ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తుల కుట్రలను ఓటు అయుధంతో తిప్పికొట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పిలుపు నిచ్చారు. గురువారం మహాత్మా జ్యోతి బాపూలే 197 వ జయంతి ని పురస్కరించుకొని గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు.