మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ రమేష్

52చూసినవారు
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ రమేష్
తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమేష్ ఓ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నాగోరావ్ హన్మాండ్లు రాఫన్ వార్ (40) ఈనెల 18న రోడ్డు దాటుతుండగా స్కూటీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని కుటుంబానికి కానిస్టేబుల్ రమేష్ రూ. 5000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్