సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ పై అధికారులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో మొత్తం 119 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్. మల్లారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.