రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ములుగు లోగల ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గల మూడు నర్సరీలలో 8 లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ కలెక్టర్ కు వివరించారు.