విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు అందజేత

78చూసినవారు
విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు అందజేత
విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపుగా అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందజేసారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశ నుండే ఉన్నత లక్ష్యం వైపుగా అడుగులు వేయాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్