రోడ్డు ప్రమాదాల నివారణకై మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని గురువారం గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ అన్నారు. ఇటీవల గజ్వేల్ పట్టణంలో పిడిచెడ్ రోడ్, క్యాసారం ఎక్స్ రోడ్, తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 20 మంది వాహనదారులను గురువారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక ఎదుట హాజరు పరచగా వారు విచారణ చేసి రూ. 14వేల జరిమానా విధించారని తెలిపారు.