గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణకు శనివారం జగదేవపూర్ పట్టణ కేంద్రంలో జగదేవపూర్ అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు, నంగునూరి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా జగదేవపూర్ అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు.