సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ప్రముఖ రచయిత రాయరావు విశ్వేశ్వరరావు సంగీత స్వరకల్పనలో రూపుదిద్దుకున్న వాడవాడల గోవిందుడు పాట ఆడియో ఆవిష్కరణ చేశారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ రచయిత రాయరావు విశ్వేశ్వరరావు స్వరకల్పనలో ఎన్నో గేయాలు రచిస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు పయనింపజేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు.