గజ్వేల్: గల్లంతయిన ఐదుగురి యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యం

69చూసినవారు
సిద్ధిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ లో శనివారం గల్లంతైన ఐదుగురి యువకుల్లో గజ ఈతగాళ్ళ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు దినేశ్వర్ అనే యువకుడి మృతదేహం లభించింది. ఈ గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ పర్యవేక్షిస్తున్నారు. వారి వెంట గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్