గజ్వేల్: మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా కృషి చేయాలి

51చూసినవారు
గజ్వేల్: మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా కృషి చేయాలి
మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, పేషంట్లు కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు, అదనపు మరుగుదొడ్లు కావాలని, మెటర్నల్ ఐసీయూ సేవల కోసం మత్తు మందు డాక్టర్ ఒకరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యులు కోరారు.

సంబంధిత పోస్ట్