అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన చాలా హృదయ విధారకమైన సంఘటన అని గజ్వేల్ పట్టణం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు గురువారం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ముఖ్యంగా ఈ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిన ఘటనలో విద్యార్థులు దుర్మరణం చెందడంపై ఆయన సంతాపం తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.