గజ్వేల్ నియోజకవర్గం అలీరాజ్ పేట గ్రామానికి చెందిన యువ సినీనటుడు అనిల్ మొగిలి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తులసి సీరియల్ ఫేమ్ నవీన్ గౌతమ్, హెబ్బా పటేల్ ముఖ్య తారాగణంగా, సిద్దిపేట జిల్లా గద్దెలపల్లి గ్రామానికి చెందిన దర్శకులు మురళీవర్ధన్ దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకోబోతున్న సంబంధించిన స్క్రిప్ట్ కు పూజా కార్యక్రమం కొండగట్టులో జరిగిందని అన్నారు