గజ్వేల్: ఉమామహేశ్వర కళ్యాణానికి గోటి తలంబ్రాలు

61చూసినవారు
గజ్వేల్: ఉమామహేశ్వర కళ్యాణానికి గోటి తలంబ్రాలు
గజ్వేల్ పట్టణంలో ఈనెల 22న సీతారామ, ఉమామహేశ్వర కళ్యాణం జరగనున్న నేపథ్యంలో కళ్యాణానికి అవసరమయ్యే గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నట్లు భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆదివారం తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని ప్రతి ఇంటిలో రామనామం స్మరిస్తూ భక్తులు గోటితో ఒలిచిన వడ్లను మహిళలు రామరాజుకు అందజేశారు. గతేడాది మాదిరిగానే రెండోసారి గోటి తలంబ్రాలతో కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని రామరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్