ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామికి శనివారం గజ్వేల్ ఎక్స్ రోడ్ – కుకునూరు పల్లె వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మంత్రిని పుష్పగుచ్ఛాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి అందరితో కలిసి ప్రజాసంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.