గజ్వేల్: పాము కాటుతో వ్యక్తి మృతి

71చూసినవారు
గజ్వేల్: పాము కాటుతో వ్యక్తి మృతి
పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాండవుల శ్రీనివాస్ రోజు మాదిరిగానే శనివారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా శ్రీనివాస్ ను పాముకాటు వేయడంతో స్థానికులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి అనంతరం ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్