సిద్దిపేట జిల్లా గజ్వేల్ బస్ స్టాండ్ వద్ద సోమవారం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివెంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రజల దాహార్తి తీర్చడంలో చలివేంద్రాలు ఉపయోగపడతాయని, గజ్వేల్ బస్ స్టాండ్ లో సత్యసాయి బాబా సేవ సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అన్నారు. ఈ కార్యక్రమంలో బస్ డిపో మేనేజర్ పవన్, నాయకులు శ్రీహరి, రాజయ్య, ప్రవీణ్, సత్య సాయి సేవా సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.