సిద్ధిపేట జిల్లా మేదినీపూర్, దుద్దెడ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్తు మరమ్మతుల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సత్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుకునూరుపల్లి, మంగోల్, మేదినీపూర్, లకుడారం, బొబ్బాయిపల్లి, ముద్దాపూర్, మాత్ పల్లి, తిమ్మారెడ్డిపల్లి, ఆరేపల్లి, వెలికట్ట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.