సిద్ధిపేట జిల్లా కొండపాక, దుద్దెడ సబ్ స్టేషన్లలో విద్యుత్తు మరమ్మతుల పనుల వల్ల శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సబ్ స్టేషన్ల పరిధిలోని కొండపాక, దమ్మక్కపల్లి, మర్పడ్గ, ఖమ్మంపల్లి, సిరిసినగండ్ల గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సత్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.