తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గంధముల రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గంలో గజ్వేల్ కు చెందిన తలకొక్కుల రాజేశంను రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజకుమార్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు గంధమల్ల రాజు ఆయనను అభినందించారు.