గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యానానికి గోటి తలంబ్రాలను అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన గోటి తలంబ్రాలు (వడ్లు) ప్యాకెట్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచలం సీతారాముల కళ్యానానికి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు.