గజ్వేల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

57చూసినవారు
గజ్వేల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ సైదా విద్యార్థులకు సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుడ్ అండ్ బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, షీ టీమ్, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవ్ టీజింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుల్లో రాణించాలన్నారు.

సంబంధిత పోస్ట్