ప్రకృతి ప్రేమికుడు, కోటికి పైగా మొక్కలను నాటి వనాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న వనజీవి రామయ్య శనివారం తుది శ్వాస విడిచారని తెలిసి చాలా విచారాన్ని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశబోయిని నర్సింలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యువతతో కలిసి వనజీవి రామయ్యను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.