గజ్వేల్: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శిస్తే సహించం

0చూసినవారు
గజ్వేల్ లో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శిస్తే సహించమని హెచ్చరించారు. బీజేపీ నాయకులు నర్సారెడ్డిపై చేసిన ఆరోపణలు ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు ఎంపీ ఫండ్ నుంచి గజ్వేల్ కు నిధులు విడుదల చేయించి, పనులు చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్