గజ్వేల్: భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో బుధవారం ఎంఈఓ యెలగందుల కృష్ణ దంపతులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను వలిచారు. అనంతరం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కి అందజేసి రామభక్తిని చాటుకున్నారు. అనంతరం ఎంఈఓ యెలగందుల కృష్ణ మాట్లాడుతూ మా చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు భద్రాచల కళ్యాణానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.