
శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా?
పరమశివుడు ధాన్యంలో ఉండగా పార్వతీదేవి ఓసారి సరదాగా శివుడి కళ్లను వెనుక నుంచి మూసేసింది. దీంతో సృష్టి అంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. అప్పుడు లోకాలను కాపాడేందుకు శివుడు తన నుదిటిపై మూడో కన్నును తెరిచాడు. ఆ కన్ను నుంచి వెలువడిన అగ్ని కాంతితో లోకానికి వెలుగు వచ్చింది. ఈ మూడో కన్ను జ్ఞానానికి, అంతర్గత దృష్టి, శక్తికి ప్రతీకగా భావిస్తారని పురణాలు చెబుతున్నాయి.