లోక్ సభ ఎన్నికలలో భాగంగా వృద్ధులు, వికలాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా హోమ్ పోలింగ్ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ సందర్భంగా మిరుదొడ్డి మండల పరిధిలోని ఆయా గ్రామాలలోని 21 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు తమ ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తో పాటు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.