పేదలు కడుపు నిండా అన్నం, కంటి నిండా సక్రమంగా నిద్రపోయేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పొందిన ఓ లబ్దిదారుని ఇంట్లో ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా సన్నబియ్యం పంపిణీ దోహదపడుతుందన్నారు.