అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు విజమ్ కుమార్ ఎండా కాలం దృష్టిలో ఉంచుకొని బోరు వేసి మోటర్ ను బిగించారు. అలాగే 20 డప్పులు కూడా అందించారు. అనంతరం కాలనీవాసులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాములు, కనకయ్య, నాగరాజు, సూరి, జానీ, తదితరులు పాల్గొన్నారు.