మర్కూక్ మండలం అంగడి కిష్టపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెపు నవీన్ రావు, బీఆర్ఎస్ యువ నాయకుడు చెప్యాల రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.