
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు.. APSRTC సిద్ధమేనా?
AP: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించారు. అయితే తెలంగాణలో ఈ పథకం ప్రారంభించాక బస్సుల్లో సీట్ల కోసం మహిళలు గొడవలు పడ్డారు. బస్సులు సరిపడా లేకపోవడం, ఓవర్లోడ్తో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. మరి ఇలాంటి సమస్యలను ఏపీఎస్ఆర్టీసీ ఎలా అధిగమిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమేనా? వేచి చూడాలి.