నాణ్యతా ప్రమాణాల ప్రకారం మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ చేయాలి

65చూసినవారు
నాణ్యతా ప్రమాణాల ప్రకారం మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ చేయాలి
నాణ్యత ప్రమాణాల ప్రకారమే సిఎంఆర్ మిల్లులకు సప్లై చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం చిన్నకోడూరు మండల పరిధిలోని విట్లాపూర్ గ్రామంలో పౌరసరపరాల శాఖ గోదాములో సిఎంఆర్ (కస్టం మిల్ల్డ్ బియ్యం) డెలివరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు వానాకాలం 2023-24 లో 58. 62% సీఎంఆర్ డెలివరీ చేసి ఇంకా 57, 121 మెట్రిక్ టన్నుల బియ్యం పెట్టవలసి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్