అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్ నియమించకపోవడం దురదృష్టకరం అని నాయి బ్రాహ్మణ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకూరి స్వామి అన్నారు. బుధవారం దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ కేటాయించి తొలుతగా 50 సంవత్సరాలకు పైబడిన వారికి 4000 రూపాయలు పింఛను అందివ్వాలని, 5 లక్షల భీమా హెల్త్ కార్డును అందివ్వాలన్నారు.