సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని ఒకటవ వార్డులో గురువారం సీఐ సైదా, పోలీసుల ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సైదా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ పై అవగాహన, డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లల భవిష్యత్తు కాపాడవలస తల్లిదండ్రుల బాధ్యత లాంటి విషయాల పై ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.