రేషన్ బియ్యం పట్టివేత

69చూసినవారు
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం జగదేవ్ పూర్ మండల పరిధిలోని దౌలాపూర్ లోపోలీసులు పట్టుకున్నారు. భువనగిరి యాదాద్రి జిల్లా పుట్టగూడెం గ్రామానికి చెందిన మాలోతు శ్రీకాంత్ అశోక్ లీలాండ్ వాహనంలో అక్రమంగా 50 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బందితో మాటువేసి పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్