కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన నాగమల్ల శ్రీనివాస్ నాగమల్ల సువర్ణ భార్య భర్తలు ఇద్దరు వికలాంగులు. పేద కుటుంబానికి చెందిన వీరికి ఉండడానికి ఇల్లు లేక కుటుంబ పోషణ కూడ కష్టంగా వుంది. ఇటీవల దాతల సహకారంతో గ్రామంలో ఇంటిని నిర్మించుకోగ, ఆ ఇల్లు ఆసంపూర్ణంగ వుంది. నాగమల్ల సాగర్ వీరి పేద పరిస్థితి వల్ల సాగర్ ని కూడా చదివించలేకపోయారు. సాగర్ కొమురవెల్లి దేవస్థానంలో కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్నారు.