ఎంపీ రఘునందన్ రావును సన్మానించిన రెడ్డి సంఘం నాయకులు

77చూసినవారు
ఎంపీ రఘునందన్ రావును సన్మానించిన రెడ్డి సంఘం నాయకులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞత సభ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కొండపాక మండలం రెడ్డి సంఘం నాయకులు ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి, కుకునూర్ పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, లకుడారం రెడ్డి సంఘం నాయకులు భీం రెడ్డి, యాదవరెడ్డి, రాం రెడ్డి, నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్