ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సకల సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నారని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆర్అండ్ఆర్ వన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను గురించి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించారు.