సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా సూర్య నమస్కారాల బృందం ఆధ్వర్యంలో హోలీ పండుగ వైభవంగా నిర్వహించి ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, రంగుల హరివిల్లు మయం కావాలని ఆకాంక్షించారు.