సిద్దిపేట: శక్తి యూత్ ఆధ్వర్యంలో కామ దహన కార్యక్రమం

70చూసినవారు
సిద్దిపేట: శక్తి యూత్ ఆధ్వర్యంలో కామ దహన కార్యక్రమం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో శక్తి యూత్ ఆధ్వర్యంలో గురువారం కామ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించి హోలీ పండుగ ప్రారంభించారు. ఈ సందర్భంగా శక్తి యూత్ సభ్యులు మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు విరబూయాలని అందరూ కోరుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శక్తి యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్