దేవాలయాల్లో శ్రావణ శోభ

59చూసినవారు
దేవాలయాల్లో శ్రావణ శోభ
శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రీ సంతోషి మాత దేవాలయంలో అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెల కొనగా ఆధ్యాత్మికత దైవ చింతన వెల్లు విరిసింది. మోహిన్ పుర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సతీ సమేతంగా దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్